7 September, 2026 | 12:52 PM

విజయక్రాంతి ఎఫెక్ట్.. వార్తపై స్పందించిన కౌన్సిలర్

07-09-2026 | 11:14am

సమస్యను పరిష్కరిస్తానని హామీ

కౌన్సిలర్ కు ఆప్ నాయకులు కృతజ్ఞతలు

భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 07 ( విజయక్రాంతి ) : ప్రజా సమస్యలపై గళం విప్పుతున్న విజయక్రాంతిలో ప్రచురిత వార్తలకు అధికారుల నుంచి స్పందన వస్తుంది. "ప్రమాదకరంగా మూల మలుపు" అనే వార్త  విజయక్రాంతి(Vijayakranthi) దినపత్రికలో ప్రచురితం అయింది. ఈ మేరకు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు కౌన్సిలర్ అప్పం కిషన్(Councilor Appam Kishan) స్పందించారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ.. సమస్యను మున్సిపల్ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల భద్రత దృష్ట్యా రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. సమస్య తన దృష్టి రావడానికి కారణం అయిన ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కోండ్ర సాయితేజ, విజయక్రాంతి దినపత్రికకు ఈ సందర్భంగా కౌన్సిలర్ కిషన్ కృతజ్ఞతలు తెలిపారు.


మరిన్ని వార్తలు