రాష్ట్రస్థాయి అండర్‌–19 ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభం

16-10-2026 | 09:57pm

క్రీడలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తాయి

ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

ఆలేరు, అక్టోబర్ 16 (విజయక్రాంతి): భువనగిరి పట్టణంలోని(Bhongir town) న్యూ డైమెన్షన్ స్కూల్‌లో(New Dimension School) నిర్వహించిన 70వ స్కూల్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి అండర్‌–19 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌–సెలక్షన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(Kumbham Anil Kumar Reddy) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉమ్మడి పది జిల్లాల నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించి టోర్నమెంట్‌ను ప్రారంభించారు.

అనంతరం క్రీడాకారులతో కలిసి క్రీడా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని అన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, జట్టుగా పనిచేసే స్ఫూర్తి పెంపొందుతాయని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకుని భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల–వెంకటేశ్వర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ డెలిగేట్ తంగళ్లపల్లి రవికుమార్, బాబురావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కూర వెంకటేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు మంగ ప్రవీణ్, ఏడుమేకల మహేష్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, టోర్నమెంట్ నిర్వాహకులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు