ప్రజల్లో చైతన్యం కోసం పీఆర్కే పార్టీ ఆవిర్భావం
9 ఏళ్లుగా నిస్వార్థ సేవలు
రాజకీయ రంగప్రవేశం చేసిన ప్రవీణ్ కుమార్
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): ప్రజలకు కూడు,గూడు, గుడ్డతో పాటు ఉచిత విద్య,వైద్యం అందించడమే పి ఆర్ కే ఉద్దేశమని పీఆర్కే వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్(Praveen Kumar, founding president of PRK) అన్నారు. గురువారం యాదగిరిగుట్టలో పీఆర్కే పార్టీ(PRK Party) ఆవిర్భావ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం యాదగిరిగుట్టలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సన్నిధి హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సెప్టెంబర్ 6వ తేదీన హైదరాబాద్లో భారీ పాదయాత్రతో అధికారికంగా పిఆర్ కే ప్రోగ్రెసివ్ రిఫార్మ్ నాలెడ్జ్ రాజకీయ పార్టీని లాంచ్ చేసినట్లు ఆయన ప్రకటించారు.
తొమ్మిదేళ్లుగా ఎలాంటి స్వార్థం లేకుండా, తన తల్లిదండ్రుల స్మరణార్థం అందిస్తున్న సేవా కార్యక్రమాలను ఇకపై మరింత విస్తృత స్థాయిలోకి తీసుకెళ్లేందుకే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వేలాది మందికి గత తొమ్మిది సంవత్సరాలుగా అన్నం కార్డ్స్ అందిస్తున్నామన్నారు.
కందిపల్లి, ఈసీఐఎల్, అమీన్పూర్, అంబర్పేట్, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో ప్రతి నెలా 10వ తేదీన నిరుపేదలకు బియ్యం, పిండి, రవ్వ, చక్కర వంటి నిత్యావసర వ స్తువులతో పాటు వారి వైద్య ఖర్చులను కూడా స్వయంగా భరిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 3,700 మందికి పైగా ప్రత్యక్షంగా ఆపద్బాంధవుడిగా నిలిచారు. దేశ, రాష్ట్ర ప్రజలకు సేవలు రాజకీయ శక్తి అవసరమని ప్రజల నుంచి వచ్చిన సూచన మేరకే పార్టీని స్థాపించినట్లు తెలిపారు. ఏ రాజకీయ పార్టీకి అనుకూలము కాదని ప్రజల జీవన విధానాన్ని మార్చే ఉద్దేశమే తోనే పాటిస్తాపించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.