సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు సిఐటియు మెరుపు ధర్నా
కాంట్రాక్ట్ కార్మికుల పట్ల నిర్లక్ష్యం తగదు ...
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజె రమేష్.
దసర బోనస్ 5500 వెంటనే చెల్లించాలి.
కొత్తగూడెం అక్టోబర్ 21 విజయక్రాంతి : సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు(Singareni contract workers_ యాజమాన్యం ప్రకటించిన దసరా లాభాల బోనస్(Dasara Profit Bonus) ,5500 రూపాయలు కార్మికుల ఖాతాలో జమ చేయకుండా, దసరా పండుగ రోజున పస్తులుంచిన సింగరేణి యాజమాన్యం మొండి వైఖరి నశించాలని, కాంట్రాక్టర్లతో వెంటనే సంప్రదించి కార్మికుల ఖాతాలో(Workers' Account) బోనస్ వెంటనే చెల్లించాలని ,సిఐటియు ఆధ్వర్యంలో హెడ్ ఆఫీస్ వద్ద మెరుపు ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా సిఐటియు(CITU) జిల్లా ప్రధాన కార్యదర్శి , ఏజె రమేష్(AJ Ramesh) మాట్లాడుతూ, సింగరేణి యాజమాన్యం ప్రకటించిన దసరా బోనస్ , పండగ ముందు రోజే వేయాల్సి ఉండగా, యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జీఎస్టీ పేరుతో కాంట్రాక్టర్లు నిలిపివేయడం జరిగిందన్నారు. యాజమాన్యంతో చర్చించినప్పటికీ కార్మికుల ఖాతాలో జమ చేయకపోవడం విడ్డూరమని, సింగరేణి చరిత్రలో లాభాల బోనస్ ప్రకటించి కాంట్రాక్ట్ కార్మికుల ఖాతాలలో జమ చేయకపోవడం, ఇదే మొదటిసారి , ఇటువంటి దౌర్భాగ్యస్థితికి దిగజారిన సింగరేణి యాజమాన్యం మొండి వైఖరిని ఖండించాలని , కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. వేతనాల చెల్లింపు లు ఆలస్యంగా అందుతున్నాయని , దీనిపై యాజమాన్యం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే సింగరేణి హెడ్ ఆఫీస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు భూక్య రమేష్ ,జిల్లా సహాయ కార్యదర్శి మాతంగి రాజేష్, నాయకులు ఎన్ రమేష్,ప్రమోద్ ,శివ ,గడల నరసింహారావు , ఎన్ ఎస్ రాజు , మహమ్మద్ నసూర్ తదితరులు పాల్గొన్నారు.