టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా మల్లారెడ్డి
21-10-2026 | 08:00pm
నంగునూరు,(విజయక్రాంతి): టీఆర్ఎస్ పార్టీ(TRS Party) సిద్ధిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నంగునూరు మండలం తిమ్మయిపల్లీ గ్రామానికి చెందిన చల్లారం మల్లారెడ్డి(Challaram Mallareddy) నియమితులయ్యారు.తన అంకితభావాన్ని గుర్తించి పదవి ఇచిన టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) కు మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.