నాటుబాంబు ఘటన

17-10-2026 | 09:09pm

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామ అటవీ(Lakshmipur Village Forest) శివారు ప్రాంతంలో నాటుబాంబు(Country Bomb) కొరకడంతో అదే గ్రామానికి చెందిన లింగంపల్లి కనకయ్య పాడి గేదె తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనతో బాధిత రైతు ఆందోళనకు గురయ్యాడు. అటవీ శివారు ప్రాంతంలో నాటుబాంబులు ఉండటంతో పశువుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఘటనపై విచారణ జరిపి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు