మూకమామిడి పంచాయతీలో పారిశుద్ధ్య పనులు

17-10-2026 | 09:14pm

ములకలపల్లి,(విజయక్రాంతి): మండలంలోని మూకమామిడి గ్రామ పంచాయతీ సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మీ ఆధ్వర్యంలో శనివారం మూకమామిడి గ్రామ పంచాయతీలోని గ్రామాలలో కలుపుమందు పిచికారీ చేయించారు.గ్రామ పరిశుభ్రతే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని  చేపట్టారు.ట్రాక్టర్,ట్యాంకర్ల సహాయంతో రోడ్ల పక్కన, డ్రైనేజీలు, ఖాళీ స్థలాల్లో విపరీతంగా పెరిగిన కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలపై మందు పిచికారీ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మీ మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రత,ప్రజల ఆరోగ్యమే తమ ముఖ్య లక్ష్యమని తెలిపారు.వర్షాల కారణంగా గ్రామంలో కలుపు మొక్కలు విపరీతంగా పెరిగి దోమల వ్యాప్తి పెరిగిందన్నారు. దీనివల్ల మలేరియా,డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని,అలాగే పాములు, తేళ్లు చేరే అవకాశం ఉందన్నారు.

అందుకే పంచాయతీ మొత్తం కలుపులేని గ్రామపంచాయతీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ స్ప్రే కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు.ప్రజలందరూ సహకరించి తమ ఇళ్ల చుట్టూ ఉన్న సామాన్లు లోపల పెట్టుకోవాలని, రోడ్ల మీద బండ్లు,ట్రాక్టర్లు లేకుండా చూసుకోవాలని,స్ప్రే సమయంలో అనుకోకుండా వాటి మీద పడే అవకాశం ఉందని సూచించారు.

పచ్చదనం మన బాధ్యత  కలుపులేని పల్లె మన లక్ష్యం శుభ్రమైన గ్రామం,ఆరోగ్యమైన ప్రజలు అనే నినాదంతో పనిచేస్తున్నామని,ప్రతి ఒక్కరూ పారిశుధ్య నిర్వహణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దోమల అరుణ్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు