విద్యార్థులకు ప్రభుత్వ విద్యా సామగ్రి కిట్ల పంపిణీ

25-11-2026 | 07:00pm

ఎమ్మెల్యే రాగమయి దయానంద్..

సత్తుపల్లి, నవంబర్ 25 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన విద్యా సామగ్రి కిట్లను సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్(MLA Ragamayi Dayanand) పంపిణీ చేశారు. సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలోని బీసీ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు యూనిఫాంలు, స్కూల్ బ్యాగులు, బూట్లు, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌తో పాటు అవసరమైన టేబుళ్లు, కుర్చీలను అందజేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహనా కమల్ పాషా, ఎంఈఓ రాజేశ్వరరావు, ఉపాధ్యాయులు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, సత్తుపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు