ఇంటి స్థలాలు కేటాయించాలని మంత్రికి వినతి

25-11-2026 | 07:02pm

టియూడబ్ల్యూజే(ఐజేయూ) యూనియన్ నాయకుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన పొంగులేటి

బూర్గంపాడు, (విజయక్రాంతి): బూర్గంపాడు మండల టియూడబ్ల్యూజే(ఐజేయూ) యూనియన్ నాయకులు తమకు ఇంటి స్థలాలు కేటాయించడంతో పాటు, ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivas Reddy)ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

జర్నలిస్టులుగా విధులు నిర్వహిస్తున్న తమకు సొంత ఇంటి స్థలం లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. అర్హులైన యూనియన్ సభ్యులకు ఇంటి స్థలాలు కేటాయించి, ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వపరంగా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.యూనియన్ నాయకుల విజ్ఞప్తిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించారు. సమస్యను పరిశీలించి, త్వరలోనే పరిష్కారానికి తగిన మార్గం చూపుతానని హామీ ఇచ్చారు. దీంతో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారమవుతుందని యూనియన్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు