37 సార్లు రక్తదానం చేసిన నాయకులు బొడ్డు కిరణ్ కు సన్మానం
ఉట్నూర్,(విజయక్రాంతి): అత్యవసర సమయంలో రక్తం అవసరం ఉన్న వారికి మానవ దృక్పథంతో రక్తదానం చేసిన ఉట్నూర్ కు చెందిన బిజెపి యువ నాయకులు బొడ్డు కిరణ్ ను అభినందిస్తూ గురువారం జాతీయ రక్తదాన దినోత్సవం(National Voluntary Blood Donation Day) సందర్భంగా ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారి బాధలను అర్థం చేసుకొని ముందుకు వచ్చి రక్తదానం చేయడం గర్వకారణమని అన్నారు.
మానవసేవే మాధవసేవ దృక్పథంతో కిరణ్ లాగా యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్,లక్కారం గ్రామ సర్పంచ్ జాదవ్ రేణుక జయచంద్ర, స్థానిక కాంగ్రెస్ నాయకులు కొత్తపెళ్లి మహేందర్, శ్రీనివాస్ , బి ఆర్ ఎస్ నాయకులు సాజిత్ కోలా సత్తన్న బిజెపి నాయకులు కుటికల రమేష్, మరికంటి నారాయణ, లక్కారం గ్రామ వాసులు రాజారాం, రామిని నాగన్న, చందు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.