భోజారెడ్డి.. ముందు నీ చరిత్ర చూసుకో..!

16-09-2026 | 04:40pm

తలమడుగు సెప్టెంబర్ 16(విజయక్రాంతి): పదవి కోసం పార్టీ మారిన నువ్వా.. నీతులు చెప్పేది అంటూ బీఆర్‌ఎస్ నాయకులు భోజారెడ్డిపై మండిపడ్డారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్(BRS) నాయకులుమాట్లాడుతూ.రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన పార్టీనే విమర్శించడం సరికాదన్నారు. అధికారంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉన్నా ఎమ్మెల్యే(MLA) అనిల్‌ జాదవ్‌పై విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే పోరాడుతుంటే ఓర్వలేక మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ హామీల అమలుపై ప్రజల తరఫున ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.


మరిన్ని వార్తలు