పంటల నష్టాల నివేదికలను ప్రభుత్వానికి తెలియజేయాలి
మాగనూరు సెప్టెంబర్ 16: మాగనూరు మండలం(Maganur Mandal)లో రైతులు వేసుకున్న పంటలు వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు దిగుబడులు రాకపోవడంతో రైతులకు పంట నష్ట పరిహారము చెల్లించుటకు వ్యవసాయ అధికారులు పంటనష్ట వివరాలను ప్రభుత్వానికి నివేదిక పంపాలని వడ్వాటు సర్పంచ్ రవీందర్ అన్నారు.
బుధవారము మాగనూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సాధారణ సమావేశo ఎంపీడీవో శ్రీనివాసల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రవీంద్ర మాట్లాడుతూ మండలంలో భూగర్భ జలాలు ఇంకిపోవడంతో, వర్షాలు కురవకపోవడంతో వేసుకున్న పంటలు పెట్టుబడులు రాక రైతులు దిగులుతో ఉన్నారు అని అన్నారు, అధికారులు పంట వివరాలను సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. అందుకు మండల వ్యవసాయ అధికారి సుదర్శన్ గౌడ్ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానన్నారు.
మండలంలో ఆయా పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలు ఉన్న దగ్గర టీచర్ల కొరత ఉందని విద్యార్థులు తక్కువ ఉన్న దగ్గర టీచర్లు ఎక్కువగా ఉన్నారని సభా దృష్టికి మందిపల్లి రఘునాథ్ రెడ్డి, కొల్పూరు సర్పంచ్ ముద్దు రాములు తీసుకువచ్చారు. అందుకు ఎంఈఓ గణేష్ సింగ్(MEO Ganesh Singh) టీచర్లను సర్దుబాటు చేస్తామని తెలిపారు. మండలంలో టీచర్ల కొత్త ఉందని విద్యా వాలంటీర్లను నియమించడం కోసం సంబంధించిన అధికారుల దృష్టికి తెలిపినట్లు వారు ఉన్నారు. చాలా గ్రామాల్లో అంగన్వాడి కేంద్రాలు లేక కిరాయి ఇండ్లలో అంగన్వాడి కేంద్రాలు నడుస్తున్నాయి అన్నారు. వివిధ శాఖల అధికారులు తమ నివేదికలను చదివి వినిపించారు ఈ యొక్క కార్యక్రమంలో అధ్యక్షులు వెంకటరెడ్డి, మీ దగ్గర గ్రామాల సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.