పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం..
25-11-2026 | 06:08pm
ఆదిలాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): పేద ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎల్టీ జగదీష్ రెడ్డి(Congress Leader Jagadeesh Reddy) అన్నారు. జైనథ్ మండలం కరంజి గ్రామంలో బుధవారం అర్హులైన 18 మంది లబ్ధిదారులకు ఆసరా చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. వితంతువులు, వయోవృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తదితర పెన్షన్ లు అందించడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో బిక్కి రమేష్, ఏనుగు రతన్ రెడ్డి, మల్లారెడ్డి, వెంకటి, బిక్కి సాయి, సోమ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.