విద్యుత్ సమస్యలను పరిష్కరించాలి

16-10-2026 | 08:35pm

తాంసి/భీంపూర్, అక్టోబర్ 16(విజయక్రాంతి): ఎల్ నినో ప్రభావంతో సరైన వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని,నీటి సౌకర్యం ఉన్న రైతులు కరెంట్ కోతలతో ఇబ్బంది పడుతున్నారని,రైతులకు నాణ్యమైన కరెంట్(Quality electricity) అందించాలని శుక్రవారం భీంపూర్ మండల సర్పంచ్లు ఎస్ఈ సుభాష్ ను కలసి వినతి పత్రం అందించారు.

ఆయనకి శాలువాతో సత్కరించారు.గ్రామాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించాలని,అవసరమైన ప్రాంతాల్లో కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని ,విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సర్పంచులు కోరారు.. ఈ కార్యక్రమంలో సర్పంచులు,కాల్చప్ యాదవ్,వినోద్,మట్టా కిరణ్,మల్లెల స్వామి,ప్రవీణ్,సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు