దండారి ఉత్సవాలలో మాజీ మంత్రి జోగు రామన్న సందడి

06-11-2026 | 09:42pm

ఆదిలాబాద్, నవంబర్ 06 (విజయక్రాంతి): దీపావళి పండగ(Diwali festival) సందర్భంగా ఆదివాసీ గూడల్లో(Adivasi Guda) దండారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జైనథ్, బేల మండలాల్లోని(Jainath, Bela mandals) బెల్గాం గూడ, బాది గ్రామాలలో నిర్వహించిన గుస్సాడి దండారి ఉత్సవాలలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. గ్రామస్తులు దండారి డోలు వాయిద్యాల మధ్య మాజీ మంత్రి కి ఘనంగా స్వాగతం పలికి  సత్కరించారు. అనంతరం జోగు రామన్న(Jogu Ramanna) గుస్సాడీ నిర్వాహకులతో  తలపై నెమలి పించం టోపీ ధరించి  గుస్సాడీ ఆడుతూ ఉత్సాహపరిచారు. మహిళలకు చీరలను అందజేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం గత 70 ఏళ్లుగా ఆదివాసులకు తీవ్ర అన్యాయం చేసిందని. కెసిఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాక  పదేళ్లు ఆదివాసి సాంస్కృతి సాంప్రదాయాలతో పాటు జోడేఘాట్ కొమరం భీం విగ్రహానికి అధికారిక నివాళులు అర్పించిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. దీపావళి దండారి ఉత్సవాలకు అధికారికంగా రూ. 10 వేల ఆర్థిక సాయం అందించి వారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహించడం జరిగిందన్నారు.

మరిన్ని వార్తలు