రైతులకు గన్ని బ్యాగుల డబ్బుల విడుదల

06-11-2026 | 07:03pm

బోథ్. నవంబర్ 6 (విజయక్రాంతి): గత ఏడాది రవి సీజన్లో మొక్కజొన్న అమ్మకాల(Corn sales) సందర్భంగా రైతులు(Farmers) సొంతంగా కొనుగోలు చేసిన గన్ని బ్యాగులకు(Gunny bags) సంబంధించిన నిధులు విడుదల అయ్యాయని కాంగ్రెస్ పార్టీ(Congress Party) జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) కేంద్రంలో మార్కెట్ జిల్లా మేనేజర్ మహేష్ కుమార్ కు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి తో కలిసి సమస్యను విన్నవించారు.

దీంతో మండలంలో 29, 399 బ్యాగులకు సంబంధించిన డబ్బులతో పాటు సోనాల మండలంలోని 12,152 బ్యాగులకు సంబంధించిన డబ్బులు విడుదల చేశారన్నారు. జిల్లావ్యాప్తంగా కన్నీరేల సంబంధించి 11,44,081,95 రూపాయలు విడుదలయ్యా అన్నారు. రైతులు తమ పంటను తక్కువ ధరలకు గళారులకు అమ్మవద్దని వారు కోరారు. రెండు మూడు రోజుల్లో జొన్న పంటకు సంబంధించిన గన్ని డెవలప్ డబ్బులు సైతం విడుదలవుతాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు