బేల అశోక్ నగర్‌లో ఘనంగా కుంకుమార్చన..

16-10-2026 | 02:26pm

మహిళలతో కిటకిటలాడిన మండపం.....

బేల అక్టోబర్ 16(విజయక్రాంతి): మండల కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో కుంకుమార్చన కార్యక్రమం(Kumkumarchana Ritual) భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలనీతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో మండపం మహిళలతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా మహిళలు భక్తిపారవశ్యంతో అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి నామస్మరణలు, భక్తి గీతాలతో మండపం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.

మహిళలు సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహం తమ కుటుంబాలపై ఉండాలని ప్రార్థించారు. కాలనీలో భక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు మహిళల మధ్య ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యాన్ని చాటిచెప్పేలా ఈ కార్యక్రమం సాగింది. మహిళల పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో అశోక్ నగర్ కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తలు