దుర్గామాత యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
నేరేడుచర్ల, అక్టోబర్ 16(విజయ క్రాంతి):నేరేడుచర్లమున్సిపాలిటీ(Nereducherla Municipality) పరిధిలోని 8వ వార్డు కోట్లగడ్డలో దుర్గామాత యూత్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కౌన్సిలర్ తాళ్ల లావణ్య సురేష్ రెడ్డి పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ...దేవి నవరాత్రి ఉత్సవాలు భక్తి,ఆధ్యాత్మికతతో పాటు ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తాయని,ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో సేవాభావాన్ని, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
దుర్గామాత యూత్ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని,భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో దుర్గామాత యూత్ సభ్యులు సుధీర్ రెడ్డి,చందు,చిలక సైదులు,సట్టు సైదులు,నాగయ్య,గణేష్,వినయ్,సైదులు,నరేందర్,పాషా,రవి,శివ,శ్రీను,సాయి తదితరులతో పాటు వార్డు ప్రజలు పాల్గొన్నారు.