బతుకమ్మ పండుగ వచ్చింది
చేగుంట అక్టోబర్ 16,విజయక్రాంతి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Government of Telangana State) మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టినా, నెల కిందటే చేగుంట మండలం లోని ఐకేపీ కేంద్రానికి చీరల మూటలు చేరిన, ఆయా గ్రామాలకు చేరకుండా చీరల మూటలు ఐకేపీ కార్యాలయంలో మూలన పడ్డాయి. గ్రామాలలో ఐకేపీ సిబ్బంది ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేయాల్సి ఉన్నా, ఉన్నతాధికారుల నుంచి అదేశాలు రాకపోవడంతో పంపిణీ నిలిచింది.
మండలం లోని పలు గ్రామాలలో వచ్చే సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలున్నప్పటికీ, మహిళలకు ఇప్పటి వరకు చీరలు చేతికి అందకపోవడంతో మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి, గ్రామాలలో బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని మహిళలు కోరుతున్నారు.