విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవు

16-10-2026 | 03:47pm
  1. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
  2. గంభీరావుపేట ఎస్సై శ్రీకాంత్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్
  3. విలేకరులపై థర్డ్ డిగ్రీ చేశారని ఆరోపణలపై డిఎస్పి  స్థాయి అధికారితో విచారణ

గంభీరావుపేట అక్టోబర్ 16 (విజయ క్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లా  గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్ థర్డ్ (Gambhiraopet SI Srikanth Third)డిగ్రీ చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎస్ఐ శ్రీకాంత్ ను ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కి అటాచ్ చేయడం జరిగిందని, ఈవిషయానికి సంబంధించి విచారణ నిమిత్తం వేములవాడ డీఎస్పీ ని విచారణ అధికారిగా నియమించామని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితె ఒక ప్రకటనలో తెలిపారు.

గంభీరావుపేట ఎస్.ఐ శ్రీకాంత్ ని లక్ష్యంగా చేసుకొని అసత్య ప్రచారాలు చేస్తూ "ఎక్దం" పత్రికలో వరుస కథనాలు వచ్చిన నేపథ్యంలో పోతురి శేఖర్, రాతిపల్లి సంపత్ లపై గంబిరావుపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది.

థర్డ్ డిగ్రీ ఆరోపణలపై డిఎస్పి స్థాయి విచారణ

అనంతరం వారిని  అరెస్టు చేసి ఈ నేల 13న పోలీస్ స్టేషన్ లో థర్డ్ డిగ్రీ ప్రయోగించి రిమాండ్ కి తరలించారని ఎస్‌ఐ శ్రీకాంత్‌ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ అధికారిగా వేములవాడ డిఎస్పీ శ్రీనివాసులు ను నియమించడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు.ఈనేపథ్యంలో ఎస్‌ఐ శ్రీకాంత్‌ను తక్షణమే ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేయడం జరిగిందని,విచారణ అధికారి సమర్పించే తుది నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని, విచారణలో ఏ అధికారి తప్పు చేసినట్లు తేలినా శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు