జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.

16-10-2026 | 03:52pm

పినపాక అక్టోబర్ 16(విజయ క్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సంబరాల్లో భాగంగా జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో(Janampet Primary Health Centre) బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వేణు  ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆరోగ్య కేంద్ర సిబ్బంది బతుకమ్మలను అందంగా అలంకరించి, ఆటపాటలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అందరూ కలిసి ఆనందోత్సాహాలతో బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్లు శేషారత్నం, నాగమణి,హెల్త్ అసిస్టెంట్ B నాగమల్లేష్, ఫార్మసీ ఆఫీసర్ , స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు,  ANMలు, 108 సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

మరిన్ని వార్తలు