ఐదు చేతుల పోచమ్మ ఆలయ నిర్మాణానికి శ్రీకారం
16-10-2026 | 03:57pm
బోథ్. అక్టోబర్ 16 ( విజయక్రాంతి) మండల కేంద్రంలో ఐదు చేతుల పోచమ్మ ఆలయ నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే జాదవ్ అనిల్ (MLA Jadhav Anil)కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. గత కొంతకాలంగా గ్రామస్తులు పోచమ్మ ఆలయ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. స్థానిక శాసనసభ్యులు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించడంతో ఆలయ నిర్మాణం పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు పట్టణ ప్రజలు ముందుకు వస్తున్నారు.