ప్రశ్నిస్తే ఆస్తుల పంచాయితీ పెట్టి తప్పించుకోవడం సిగ్గుచేటు
పినపాక మాజీ ఎంపీపీ గుమ్మడి గాంధీ
పినపాక అక్టోబర్ 16(విజయ క్రాంతి): పినపాక నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అధికార కాంగ్రెస్ పార్టీ(The ruling Congress party) ప్రతిపక్ష నాయకుల ఆస్తుల పంచాయితీ పెట్టి తప్పించుకోవడం సిగ్గుచేటని పినపాక మాజీ ఎంపీపీ గుమ్మడి గాంధీ(Former MPP Gummadi Gandhi) అన్నారు.
శుక్రవారం ఆయన పినపాకలో విలేకరులతో మాట్లాడుతూ BRS పార్టీ తరుపున పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మణుగూరు పట్టణం అంతా దుమ్ముధూళీతో నిండిపోయి ప్రజలు జబ్బులమారిన పడుతున్నారని దుమ్ము, ధూళీ శుభ్రం చేయాలని డిమాండ్ చేస్తేగాని ప్రజల సమస్య తెలుసుకోని ఈ అధికార పార్టీ ఎమ్మెల్యే, నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు భూముల విషయం మాట్లాడుతున్నారని అన్నారు.
వ్యక్తిగతంగా ఉన్న ఆస్తుల గురించి మాట్లాడాల్సి వస్తే తాజా గారికి ఎక్కడ ఎన్ని ఎకరాల భూమి ఉన్నది అనేది కాంగ్రెస్ పార్టీ నాయులకు, కార్యకర్తలకు తెలుసన్నారు. మా కష్టం మీద గెలిచి ఆయన వందల ఎకరాలు భూమి కొనుకుంటున్నారని పాపం కాంగ్రెస్ పార్టీ నాయకులే తీవ్ర మనోవేదనతో ఉన్నారని అన్నారు. కాని అధికారం ఉందికదా ఏదో సహయం చేస్తారని చూస్తున్నారని, భవిష్యత్లో మీ కాంగ్రెస్ నాయకులే మీ బండారం బయటపెడతారని తెలిపారు.
రేగా కాంతారావు సంపాదించిన రూపాయిలో పేదలకు, విద్యార్ధులకు సహాయ సహకారాలు ఎన్నో చేశారని మీ నాయకుడికి ఆగుణం ఉందో లేదో మీ అంతరాత్మకు తెలుసన్నారు. రేగా కాంతారావు మీద ఎవరైనా హద్దుమీరి మాట్లాడితే సంహించేది లేదన్నారు.
ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ప్రజా సమస్యలపై ప్రశ్నించిన వారికి సమస్య పరిష్కారం చేసి సమాధానం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు పడిగె అశోక్, రాము, వెంకటనర్సయ్య, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.