సోయాబీన్ పంట కొనుగోలుకు ఇతర జిల్లాల నుండి వ్యాపారులు రాక

16-10-2026 | 03:49pm

బోథ్. అక్టోబర్ 16 (విజయ క్రాంతి) సోయాబీన్ పంట(Soybean crop) కొనుగోళ్లకు కామారెడ్డి తోపాటు మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు మండలంలోని పలు గ్రామాలకు వచ్చి పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. గురువారం కామారెడ్డి వ్యాపారులు బజార్హత్నూర్ మండలంలోని పలు గ్రామాలు పోయా పంట కొనుగోలు చేశారు. ఇతర జిల్లాల నుండి వ్యాపారులు వస్తుండడంతో సోయా పంటకు రెక్కలు వచ్చాయి. 6,600 నుండి 6,800 వరకు క్వింటాలు ధరగా చెల్లించి కొనుగోలు చేశారు.

ఇతర ప్రాంతాల నుండి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నందుకు స్థానిక వ్యాపారుల సైతం ఎక్కువ ధరకుకొనుగోలు చేయాల్సి వచ్చింది. కాగా సోయా పంటను నిలువ ఉంచే వ్యాపారులు ముందుగా ధర వస్తుందన్న ఆలోచనతో పంటను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో ధరలు ఒక్కో రోజు 50 రూపాయలు పెరగడంతో రైతులు సైతం ధర పెరుగుతుందని పంటను అమ్మేందుకు ముందుకు రావడం లేదు. ఏది ఏమైనా సోయా బీన్ పంట ధరకు రెక్కలు వచ్చాయి.

మరిన్ని వార్తలు