ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి

23-11-2026 | 04:19pm

ఐటీడీఏ ఉట్నూర్ అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి జాదవ్ వసంత్ రావ్ 

ఉట్నూర్, నవంబర్ 23  ( విజయక్రాంతి): ఐటీడీఏ కార్యాలయంలో(ITDA offices)  నిర్వహించే ప్రజావాణి లో ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఉట్నూర్ అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి(Utnoor Assistant Project Officer)  జాదవ్ వసంత్ రావ్ అధికారులను సూచించారు .

సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల వినతులను ఆయన స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇంద్రవెల్లి మండలం పాటగూడ గ్రామానికి చెందిన కొడప వనిత తనకు కిరాణా దుకాణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆదిలాబాద్ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన మెస్రం అనూష తమ గ్రామానికి సి సి రోడ్డు మంజూరు  చేసి సీసీ రోడ్డు నిర్మించాలని కోరారు.ఉట్నూర్ మండలం శ్యాం నాయక్ తాండ గ్రామానికి చెందిన యోగీత తనకి ఆర్థిక సహాయం కొరకు దరఖాస్తు అందజేసారు,

అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల లబ్ధి, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారం తదితర అంశాలపై తమ వినతిపత్రాలను సమర్పించారు. ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖ అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని ప్రాజెక్టు అధికారి మంద మకరందు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు