బాలలభద్రతపై అవగాహన ఉండాలి
బోథ్ అక్టోబర్ 27 (విజయక్రాంతి): బాలల భద్రత(Child Safety)పైన ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని బోత్ మున్షిప్ మెజిస్ట్రేట్ కే సందీప్ పేర్కొన్నారు. స్థానిక పోలీసుల సమన్వయంతో మండల కేంద్రంలోని టీజీ మోడల్ స్కూల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఫోక్సో చట్టం సురక్షితమైన అసురక్షితమైన స్పర్శలు వ్యక్తిగత హద్దులు ఆన్లైన్ భద్రతపై అవగాహన కలిగించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే పెద్దలకు తెలపాలని విద్యార్థులకుసూచించారు. సహాయం అందించే వరకు చెబుతూనే ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఏజిపి పందరం శంకర్, న్యాయవాదులు పాడేపు హరీష్, కుమ్మరి విజయ్ కుమార్, పిసి లైలా, అంబాజీ, ప్రిన్సిపాల్ అనురాధ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.