బైండోవర్ ఉల్లంగించిన వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష

14-10-2026 | 10:51pm

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని దన్నూరు గ్రామానికి(Danoor village) చెందిన జక్క బొజరెడ్డి అనే వ్యక్తి మే 11న మట్కా ఆడుతున్నాడు అన్న కేసులో తాసిల్దార్ సుభాష్ చంద్ర ఎదుట పోలీసులు బైండోవర్ చేశారు. అయితే నిబంధనలు ఉల్లంఘిస్తే రూపాయిలు లక్ష జరిమానా లేదా ఆరు నెలలు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తాసిల్దార్ హెచ్చరించారు.

అయినా తన ప్రవర్తనలో మార్పు రాకుండా జులై 22న మళ్లీ మట్కా అరుపు పోలీసులకు పట్టుబడడంతో బుధవారం అక్టోబర్ 14న తాసిల్దార్ ఎదుట హాజరు పరిచారు. దీంతో మూడు నెలల జైలు శిక్ష విధించడం జరిగిందని ఎస్ఐవి పురుషోత్తం తెలిపారు. దీంతో ఆయనను రిమాండ్ కు తరలించామన్నారు.

మరిన్ని వార్తలు