సింగరేణి స్కామ్‌లపై కేటీఆర్ ఫైర్

14-10-2026 | 08:47pm

హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ(Singareni Collieries Company)లో అవకతవకలు జరిగాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. గోదావరిఖనిలో నిర్వహించిన బీఆర్ఎస్ ‘సింగరేణి కార్మిక గర్జన’ సభ(BRS Singareni Workers Garjana Sabha)లో ఆయన మాట్లాడుతూ నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లు(Naini Coal Block Tender), సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనతో పాటు పలు కాంట్రాక్టుల వ్యవహారాలను ప్రస్తావించారు. 


నైనీ టెండర్ల విషయంలో వాటాలు కుదరకపోవడంతోనే వాటిని రద్దు చేశారని కేటీఆర్(KTR) ఆరోపించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన పేరుతో రూ.10 వేల కోట్ల మేర అక్రమాలు జరిగాయని, సోలార్, జిలెటిన్ స్టిక్స్ తదితర వ్యవహారాల్లోనూ అవకతవకలు ఉన్నాయని పేర్కొన్నారు. సింగరేణి వ్యవహారంపై ఆధారాలతో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Minister Kishan Reddy)కి లేఖ రాశామని, గవర్నర్‌ను కలిసి విచారణ కోరామని కేటీఆర్ తెలిపారు.

సింగరేణి సంస్థ ప్రయోజనాలు, కార్మికుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపైనా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. సంస్థలో అక్రమాలు జరిగాయంటూ పరస్పరం లేఖలు రాసుకుంటున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు