కోడలికి 25 రకాల బతుకమ్మలు.. అత్తింటివారి అదిరిపోయే గిఫ్ట్!

14-10-2026 | 01:49pm

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేళ ఓ అత్తింటి కుటుంబం వినూత్నంగా ఆలోచించింది. కొత్తగా ఇంటికి వచ్చిన కోడలికి ఏకంగా 25 రకాల బతుకమ్మలను వాయినంగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ప్రత్యేకమైన కానుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో (Social Media) వైరల్‌గా మారింది.

కొత్త కోడలికి వినూత్న కానుక

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం అగ్గిమల్ల గ్రామానికి చెందిన చిట్టిమల్లే అరవింద్‌ కుటుంబం తమ ఇంటి కోడలికి ఈ వినూత్న వాయినాన్ని అందించింది. సంప్రదాయానికి ప్రత్యేకతను జోడిస్తూ 25 రకాల బతుకమ్మలను సమర్పించడం అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా బతుకమ్మ పండుగ సందర్భంగా పూలతో బతుకమ్మలను పేర్చి పూజలు నిర్వహిస్తారు. అయితే, ఈ కుటుంబం కొత్త కోడలికి ఇన్ని రకాల బతుకమ్మలను వాయినంగా ఇవ్వడం విశేషంగా నిలిచింది.

నెట్టింట ఫన్నీ కామెంట్లు

ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘బంగారం బతుకమ్మ కూడా చేసి నిమజ్జనం చేసి, ప్లేస్ ఎక్కడో చెబితే మేం వెళ్లి తెచ్చుకుంటాం’ అంటూ కొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ‘ఇన్ని రకాల బతుకమ్మలను ఏం చేసుకుంటారు?’ అంటూ ప్రశ్నిస్తున్నారు.

సంప్రదాయానికి ప్రత్యేక గుర్తింపు

బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళలకు ఎంతో ప్రత్యేకమైనది. పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో సంబరాలు చేసుకోవడం ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ. అలాంటి పండుగలో కొత్త కోడలికి 25 రకాల బతుకమ్మలను వాయినంగా అందించడం సంప్రదాయానికి కొత్త అందాన్ని తీసుకొచ్చింది. ఈ వినూత్న కానుకతో అరవింద్‌ కుటుంబం అందరి దృష్టిని ఆకర్షించగా, వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు