పువ్వులను దేవతలుగా పూజించే పండుగ బతుకమ్మ
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేనాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కలెక్టరేట్(Hanamkonda Collectorate) ప్రాంగణంలో ఉద్యోగ సంఘాల నేతృత్వంలో బతుకమ్మ వేడుకలు(Bathukamma celebrations) బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన మహిళా ఉద్యోగినిలు పెద్ద సంఖ్యలో హాజరై తీరోక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పండుగ వేడుకలు అత్యంత వైభోపీతంగా,మహిళల బతుకమ్మ ఆటపాటలతో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Nayini Rajender Reddy) దంపతులు, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి(Collector Chahat Bajpai) డి వరుణ్ రెడ్డి దంపతులు అదనపు కలెక్టర్ రవి(రెవెన్యూ), శేషాద్రి( స్థానిక సంస్థలు) హాజరయ్యారు.మహిళా ఉద్యోగులతో కలిసి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, ఎమ్మెల్యే సతీమణి నాయిని నీలిమా రాజేందర్ రెడ్డి బతుకమ్మ ఆటపాటలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని, ఈ వవిశిష్టమైన సాంస్కృతిక వారసత్వంను భావితరాలకు అందించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అత్యంత వైభవంగా హనుమకొండ కలెక్టరేట్లో బతుకమ్మ వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుతున్నరని పేర్కొంటూ జిల్లాలోని అధికారులకు, ఉద్యోగులకు సద్దుల బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ మహిళలను శక్తి రూపంగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ ప్రజలదని పువ్వులని దేవుళ్ళుగా పూజించే పండుగ ప్రపంచంలో ఒక బతుకమ్మ పండుగ మాత్రమే అని పేర్కొన్నారు. జిల్లాలోని మహిళా ఉద్యోగినులతో కలిసి బతుకమ్మ పండుగ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందాన్ని కలిగిస్తున్నదని పేర్కొన్నారు. అన్నీ బతుకమ్మ లు చాలా బాగున్నాయని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లాలోని ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు, ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా పండుగల శుభాకాంక్షలు తెలియజేశారు.
ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఆకుల రాజేందర్ మాట్లాడుతూ మహిళా శక్తికి ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని పేర్కొంటూ ప్రతి సంవత్సరం కలెక్టరేట్లో బతుకమ్మ వేడుకలను అత్యంత ఘనంగా ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము అని అందుకు సహకరిస్తున్న జిల్లా కలెక్టర్, అధికారులు ,ఉద్యోగ సంఘాల నేతలకు, ఉద్యోగులకు ఉద్యోగ సంఘాల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అత్యంత తీరోక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.
డిఆర్డిఏ మొదటి బహుమతి,రెండవ బహుమతి ఐ సి డి ఎస్, మూడవ బహుమతి కలెక్టరేట్ రెవెన్యూ, స్పెషల్ ప్రైజ్ కాకతీయ మెడికల్ కాలేజ్ లకు లభించాయి.ఈ కార్యక్రమంలో డీఆర్ఓ శ్రీనివాస్ డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య, సి పి ఓ సత్యనారాయణ రెడ్డి ,ఉద్యోగ సంఘాల నేతలు బైరి సోమయ్య, పుల్లూరు వేణుగోపాల్,పనికల రాజేష్,జగన్ మోహన్ రెడ్డి, డాక్టర్ ప్రవీణ్, శ్యాంసుందర్, మాధవరెడ్డి, రాము నాయక్,శ్రీనివాస్ రెడ్డి, జయంతి,శ్రీలత, నాగరాణి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.