కాళ్ళకల్ లోని దుర్గామాతను సందర్శించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

14-10-2026 | 10:56pm

మనోహరాబాద్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak district) మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ పట్టణ కేంద్రంలోని బంగారమ్మ దేవాలయ ప్రాంగణంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు(Durga Navaratri celebrations) ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి దుర్గామాతను సందర్శించి వేద బ్రాహ్మణతములు వేణు శాస్త్రి గారిచే ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మాత స్వాములు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఇందులో అనిల్ యాదవ్, గొల్లపల్లి సత్యనారాయణ, రాజు యాదవ్, నేతికుంట సత్యనారాయణ, కుమ్మరి నాగరాజు, నేతికుంట సాగర్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు