కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా.. అసలేం జరిగింది?
గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ(Aija Municipality)లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు కౌన్సిలర్లు రాజీనామా(Congress Councillors Resign) చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి(MP Mallu Ravi) వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి గుడ్‌బై చెప్పామని, ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు రాజీనామా లేఖ పంపినట్లు కౌన్సిలర్ల వెల్లడించారు.
బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి సహకరిస్తున్నారని కౌన్సిలర్లు ఆరోపిస్తూ, పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు నాయకత్వం నుంచి తగిన మద్దతు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు కౌన్సిలర్ల పేర్కొన్నారు.
ఒకేసారి ఏడుగురు కౌన్సిలర్లు రాజీనామా చేయడం అయిజ స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వారి నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ(Congress Party) నాయకత్వం ఎలా స్పందిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. అయితే, ఈ ఆరోపణలపై సంబంధిత నేతలు స్పందిస్తేనే మరింత స్పష్టం తెలుస్తుందని రాజకీయ వర్గాలు వెల్లడించాయి.