దైవదర్శనానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం

24-10-2026 | 11:28am

నారాయణఖేడ్/ మనూర్, అక్టోబర్ 23 : కర్ణాటకలోని బాల్ కి వద్ద శుక్రవారం రాత్రి కారు బస్సు ఢీకొన్న సంఘటనలో తెలంగాణ రాష్ట్రం(Telangana State) సంగారెడ్డి జిల్లా మనూరు పట్టణానికి చెందిన ఇద్దరు మృతిచెందగా కారులో ప్రయాణిస్తున్న ఇతరులకు తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మనూరు పట్టణానికి చెందిన  భార్యభర్తలు  మాజీ సర్పంచ్(Former Sarpanch) సంగమని (48) సంజీవ్ (56) వీరు ప్రమాదం జరిగిన చోటే అక్కడికక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలు అయిన ఇతరులను చికిత్స నిమిత్తం బీదర్ జిల్లా కేంద్రానికి అంబులెన్స్ లో తరలించారు.

వీరు మహారాష్ట్రలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తుల్జాపూర్ భవాని మాతను దర్శించుకోవడానికి వెళుతున్న క్రమంలో బాల్కి వద్ద కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న బసవ కళ్యాణ్ ఎమ్మెల్యే శరణు షెల్గాన్ సంఘటన స్థలాన్ని సందర్శించి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాహనంలో ప్రయాణిస్తున్న వారందరూ కూడా ఒకే కుటుంబానికి చెందినవారని మనూర్ గ్రామస్తులు తెలిపారు. క్షతగాత్రులకు బీదర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు