ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం
బోథ్. అక్టోబర్ 13 ( విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్(Telangana Public School) మంజూరి చేయించడానికి కృషి చేసిన ఎమ్మెల్యే జాదవ్ అనిల్ ను(MLA Jadhav Anil) అభినందిస్తూ గ్రామానికి చెందిన యువకులు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. నూతనంగా ఏర్పడ్డ మండలానికి టీపీఎస్ పాఠశాల మంజూరు కి కృషి చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు.
మండల ప్రజల కోరికను తీర్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సోనాల గ్రామ నాయకులు సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీకాంత్, వార్డు సభ్యులు హరీష్, రమేష్ లతోపాటు బి ఆర్ ఎస్ నాయకులు ఈర్లఅభిలాష్, అఖిల్, గౌతమ్ రెడ్డి, రాజన్న తదితరులు పాల్గొన్నారు.