ఎల్ నినో ప్రభావాన్ని సమిష్టిగా ఎదుర్కొనాలి
ప్రతి ఒక్కరూ నీటి పొదుపులో పాటించాలి
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్,(విజయక్రాంతి): ఎల్ నినో ప్రభావాన్ని(impact of El Niño) ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, ఈ ప్రభావాన్ని ఎదురుకునేందుకు సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) అన్నారు. శనివారం ఉట్నూర్ ఎంపీడీవో కార్యాలయంలో 59 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న మహిళలు ఉద్దేశించి మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ నీటి పొదుపులో పాటించాలని, అందుకు ప్రభుత్వం తరఫున నిర్మించే ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని సూచనలు చేశారు.
రాబోయే కాలంలో నీటి కొత్త తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని , నీటి కొరతను ఎదుర్కొనేందుకు ఇప్పటినుండే పొదుపు పాటించాలని సూచనలు చేశారు. అనంతరం చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రైస్ ఉల్లా, తహసిల్దార్ కోట్ల రఘునాథరావు, సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.