ఇర్విన్ రిజర్వాయర్‌ను రద్దు చేయాలని ఆందోళన

17-10-2026 | 04:12pm

కొండారెడ్డిపల్లి గేటు వద్ద రైతుల నిరసన

కల్వకుర్తి: డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు(Dindi Lift Irrigation Project)లో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడుగుల మండలం ఇర్విన్ లో నిర్మించతలపెట్టిన ఇర్విన్ రిజర్వాయర్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయా గ్రామాల ప్రజలు శనివారం ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు.

రిజర్వాయర్ నిర్మాణం చేపడితే తమ విలువైన వ్యవసాయ భూములను కోల్పోవాల్సి వస్తుందని గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించే పరిహారం తమ భూములకు ప్రత్యామ్నాయం కాదని, భూములు కోల్పోతే తమ జీవనాధారం దెబ్బతింటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇర్విన్ రిజర్వాయర్ నిర్మాణ ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యపై తక్షణమే స్పందించి రిజర్వాయర్ రద్దుపై నిర్ణయం తీసుకోవాలని ఆందోళనకారులు కోరారు. లేనిపక్షంలో నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు