కొండ ముచ్చుతో జనం సతమతం

17-10-2026 | 06:37pm

బోథ్. అక్టోబర్ 17 ( విజయక్రాంతి): సోనాల మండల(Sonala Mandal) కేంద్రంలో కొండముచ్చు(Baboon) వల్ల ప్రజలు సతమతమవుతున్నారు. గత మూడు రోజుల నుండి ప్రజలపై దాడులు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది. ప్రజలు పడుతున్న ఇబ్బందులను సంబంధిత అటవీశాఖ(Forest Department) అధికారికి తెలపడంతో శనివారం కొండమూచ్చును పట్టుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు.

అటవీ శాఖ అధికారులకు సహితం కొండముచ్చు దొరకకపోవడంతో దానిని ఎలాగైనా పట్టుకోవాలని నిర్ణయంతో సిబ్బంది ఉన్నారు. ఇప్పటికే రెండు ముచ్చు పలువురు గ్రామస్తులపై దాడి చేయడంతో పాటు హోటల్లు, ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్లి ఇబ్బందులకు గురి చేస్తున్నది.

మరిన్ని వార్తలు