కూలీల వలసకు చెక్: ఎంపీడీవో
బోథ్,(విజయక్రాంతి): మండలంలో నీటి కరువు రాకుండా కూలీలు వలస పోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఎంపీడీవో ఎల్ రమేష్(MPDO Ramesh) పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎల్ నినో ప్రభావం నుండి రక్షించుకునేందుకు ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నీటి వృధా(Wastage of water)ను అరికట్టడంతో పాటు భూగర్భ జలాలను ఇస్టారీతిన వాడకుండా చూడాలని గ్రామాల కార్యదర్శులకు సర్పంచ్లకు తగు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. గ్రామాలలో బోరు బావుల వినియోగం 1 hp 2hp మోటార్ల వినియోగంపై తగు ఆదేశాలు ఇచ్చామన్నారు.
ఉదయం సాయంత్రం మూడు గంటలు మాత్రమే విద్యుత్ నీటి పంపులు వినియోగించాలని తెలపడం జరిగిందన్నారు. భూగర్భ జలాల(Groundwater) పెంపు కోసం అన్ని గ్రామ పంచాయతీలలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని తెలిపే మన్నారు. ఇంటి వద్ద బోర్ల పక్కన ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని ప్రజలను చైతన్యం చేస్తున్నామన్నారు. సామూహిక ఇంకుడు గుంతలతోపాటు మురికి కాలువల చివరన ఇంకుడు గుంతలను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. రైతులు ముందు జాగ్రత్తగా ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచిస్తున్నామన్నారు.
ఇవి కూడా చదవండి: ప్రతి కుటుంబానికి రేషన్
తక్కువ నీటితో పంటలు సాగయ్యే విధంగా చూసుకోవాలన్నారు. రబీ పంట సాగులో శనగ కంది పెసర పంటలను సాగు చేయాలని రైతులకు సూచించాలని వ్యవసాయ శాఖ అధికారులను కోరేమన్నారు. కూలీలు వలస పోకుండా... వ్యవసాయ పనులు తగ్గిపోతున్నందున కూలీలు వలస పోకుండా చూడాలని గ్రామాల కార్యదర్శులకు తెలిపామన్నారు. రైతులు తమ పొలాలలో పంట నీటి కుంటలను ఏర్పాటు చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు.
నీటి కుంటల నిర్మాణం చేపడితే ఉపాధి హామీ పథకం కింద నిధులు వస్తాయని విషయాన్ని వివరించాలన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో 150 నుండి 200 వరకు కూలీలు పనిచేసే విధంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. చెరువులలో పూడికతీత ,రాతి కట్టల నిర్మాణం, ట్రెంచ్ లతవ్వకం ,వంటి పనులు చేపట్టాలని కోరారు. ఉపాధి హామీలు 375 రకాల పనులను చేపట్టే విధంగా ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చే అన్నారు. అయితే అందులో అత్యవసర పనులను గుర్తించి పనులు పూర్తయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత ఉపాధి హామీ సిబ్బందిపై ఉందన్నారు.