తట్టి అన్నారంలో మహిళా దారుణ హత్య

07-10-2026 | 01:58pm

- ఓయూ మాణిక్వేశ్వర్ నగర్ చెందిన మంగమ్మగా గుర్తింపు

- గత 28 న మిస్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు 

- సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎల్బీనగర్ ఇంచార్జి ఏసీపీ రవీందర్ రెడ్డి

అబ్దుల్లాపూర్ మెట్: తట్టి అన్నారంలో మహిళా దారుణ హత్యకు గురై మృతదేహం లభ్యమైన సంఘటన నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) మాణిక్యే శ్వర నగర్ కు చెందిన మంగమ్మ గత నెల  28 న మిస్సయినట్లు  ఓయూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. 

10 రోజుల తర్వాత మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) ఎల్బీనగర్ జోన్  నాగోల్ సర్కిల్ పెద్ద అంబర్ పేట్ తట్టి అన్నారం (నాగోల్ బండ్లగూడ బస్ డిపో) వెనుక గోల్డెన్ లీవ్స్ విల్లాస్ వెళ్లే మార్గంలో మంగమ్మ చేతులు, కాళ్లను కుక్కలు  చెల్లు చెదరం చేస్తుంటే  మార్నింగ్ వాక్ కు వెళ్లేవాళ్లు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా మధ్యం బాటిల్లు కనిపించాయి. ఎల్బీనగర్ ఇన్చార్జి ఏసీపీ రవీందర్ రెడ్డి, క్లూస్ టీం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మహిళను అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళా మృతదేహానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు