ప్రతం ఫౌండేషన్ ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
26-09-2026 | 01:35pm
బోథ్. సెప్టెంబర్ 26 ( విజయక్రాంతి): ప్రతం ఫౌండేషన్ వారు ఇచ్చే ఉచిత శిక్షణను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సోనాల ఎంపీడీవో(MPDO) రత్నాకర్ రావు పేర్కొన్నారు. శనివారం ఎందుకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. 45 రోజుల పాటు నిర్మల్ పట్టణంలో హోటల్ మేనేజ్మెంట్9Hotel Management) కోర్స్ నైపుణ్యం కలిగిన యువతకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉచిత భోజనం యూనిఫామ్ షూస్ హోటల్ మేనేజ్మెంట్ కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తారన్నారు. కార్యక్రమంలో కమ్యూనిటీ మొబలైజర్ పసుల రమేష్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కోర్సులో చేరేవారు 6303603145, 995986 56 45ఈ క నెంబర్లను సంప్రదించాలన్నారు.