దొరల దౌర్జన్యాలపై ఐలమ్మ తిరుగుబాటు

26-09-2026 | 01:38pm

మంథనిలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 131వ జయంతి వేడుకలు

మంథని, సెప్టెంబర్ 26(విజయ క్రాంతి): తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యసాహసాలతో నిలిచి, భూమి కోసం, భుక్తి కోసం, బానిస బతుకుల విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ(Janata Party) మంథని పట్టణ బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంథని పట్టణ అధ్యక్షుడు సబ్బని సంతోష్(Sabbani Santosh) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంతోష్ తో పాటు పట్టణ మాజీ అధ్యక్షుడు బూడిద తిరుపతి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలపై నిజాం పాలకులు, రజాకార్లు, జమీందారులు, దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ ధైర్యంగా పోరాడారని గుర్తుచేశారు. పేద ప్రజల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.

భూమి కోసం, భుక్తి కోసం సాగిన పోరాటంలో ఐలమ్మ చూపిన తెగువ, ధైర్యం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు బోగోజు శ్రీనివాస్, అసెంబ్లీ కో-కన్వీనర్ నాంపల్లి రమేష్, పట్టణ మాజీ అధ్యక్షుడు చిలువేర సతీష్, సీనియర్ నాయకుడు నారమల్ల కృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శులు సామల అశోక్, ఎడ్ల సాగర్, పట్టణ కార్యదర్శులు పార్వతి విష్ణు, మాచిడి శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు