జెవివి ఓజోన్ పొర దినోత్సవం
16-09-2026 | 05:48pm
నిర్మల్ సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ ఓజోన్ పొర దినోత్సవం(World Ozone Day) స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మాలవత్ బిక్షపతి నాయక్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో విద్యార్థులకు ఓజోల్ పురక్షణపై అవగాహన కల్పించారు.
ఓజోన్ పొర ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. అనంతరం సీనియర్ సైన్స్ ఉపాధ్యాయుడు శివలింగయ్య ఓజోన్ పొర నశించిపోతే భూమండలానికి జీవరాశులకు కలిగే నష్టాలను వివరించారు. కార్యక్రమంలో జెవివి కార్యకర్తలు ప్రధానోపాధ్యాయులు సుచిత్ర లక్ష్మీపతి, సాదిక్, షమీ, మమత, రమేష్, నరసింహస్వామి, రవి, విద్యార్థులు పాల్గొన్నారు.