ఈపీఎఫ్ఓ వేతన పరిమితి పెంపు..కేంద్రం నిర్ణయం
16-09-2026 | 05:45pm
ఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO)కు సంబంధించి కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని నెలకు రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచేందుకు నిర్ణయించింది.ఈ నిర్ణయంతో 51 లక్షలకు పైగా అదనపు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. అర్హత పొందే ఉద్యోగులకు ఈపీఎఫ్‌తో పాటు పెన్షన్, ఇన్సూరెన్స్ ప్రయోజనాలు కూడా అందనున్నాయి.2014 తర్వాత తొలిసారిగా ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని పెంచుతున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం అమలుతో కేంద్ర ప్రభుత్వంపై సంవత్సరానికి సుమారు రూ.11,339 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది.