విజ్ఞేశ్వర స్వామి ఆలయంలో ఎంగిలిపూల బతుకమ్మ
కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని శ్రీ విజయ విజ్ఞేశ్వర స్వామి దేవస్థానం(Sri Vijaya Vigneshwara Swamy Devasthanam) నందు, శ్రీ స్వర్ణ దుర్గ అమ్మవారి శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం 7 గంటలకు ఎంగిలిపూల బతుకమ్మ(Engilipoola Bathukamma) ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రేపు 11-10-2026 ఆదివారం నుండి తేది: 20-10-2026 మంగళవారం వరకు అమ్మవారి, శరన్నవరాత్రి ఉత్సవాల(Sharannavaratri celebrations)లో వివిధ అలంకరణములలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్ద ప్రసాదంలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కార్యనిర్వాహక అధికారి తెలియచేస్తున్నారు.