అంగరంగ వైభవంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు
జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు
మంచిర్యాల (విజయక్రాంతి): పూలనే పూజించే ఏకైక పండుగ బతుకమ్మ సంబరాలు(Bathukamma Celebrations) జిల్లా వ్యాప్తంగా శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలలో భాగంగా తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మను మహిళలు భక్తిశ్రద్ధలతో(Devotional) ఉపవాసంతో ఉండి రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి సాయంత్రం నూతన వస్త్రాలతో వీధి ప్రధాన కూడలి వద్ద ముత్యాల ముగ్గులు వేసి, తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను తీసుకువచ్చి బతుకమ్మ పాటలు పాడుతూ పాటలు ఆడారు.
సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. బతుకమ్మ పాటలు(Bathukamma Songs), మహిళల కోలాటాలు, పూల పరిమళాలతో జిల్లా కేంద్రంతోపాటు, కార్పొరేషన్, మున్సిపాలిటీలతో(Corporations and municipalities) పాటు గ్రామాలన్ని పండుగ శోభ సంతరించుకున్నాయి. ఉత్సాహంగా ఆడి పాడిన అనంతరం గ్రామ పొలిమేరలో ఉన్న చెరువులు, వాగులు వంకలలో, ఆలయాల ప్రాంగణాలలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.