జాతీయ రహదారిపై ప్రమాదం.. బాలుడు మృతి

10-10-2026 | 11:11pm

ఎర్రవల్లి, అక్టోబర్ 10: : ఇటిక్యాల స్టేజ్‌(Itikyala Stage) సమీపంలోని జాతీయ రహదారి-44పై ట్రాక్టర్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తండ్రీకొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలు ఆస్పత్రికి(Kurnool Hospital) తరలిస్తుండగా కుమారుడు రాము (14) మృతిచెందగా, తండ్రి శ్రీనివాసులు (42) చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవి రాథోడ్(SI Ravi Rathod) తెలిపారు.

మరిన్ని వార్తలు