తెలంగాణ క్రీడాకారులు పతకాలతో మెరవాలి
- మంత్రి పొంగులేటి
- అశ్వారావుపేట మినీ స్టేడియాన్ని మణిహారంగా తీర్చిదిద్దుతాం
- క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ, అన్ని విధాలా ప్రోత్సాహం
- విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత శిఖరాలకు చేరాలి
- గిరిజన ప్రాంతాల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం కృషి
- 33 జిల్లాల బాలికల కబడ్డీ పోటీలకు అశ్వారావుపేట వేదిక
- రూ.23.50 కోట్లతో చేపట్టిన రహదారుల అభివృద్ధి పనుల ప్రారంభం
అశ్వారావుపేట అక్టోబర్ 10(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు(Athletes) జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో(National and international level) ప్రతిభ చాటి పతకాలు సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy) అన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని క్రీడాకారులకు సూచించారు.
శనివారం ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో రాహుల్ తో కలిసి అశ్వారావుపేట పట్టణంలో రూ.23.50 కోట్ల వ్యయంతో చేపట్టిన రహదారుల అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు, మినీ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-20 బాలికల కబడ్డీ పోటీలను మంత్రి ప్రారంభించారు.
అశ్వారావుపేట పట్టణంలో రహదారుల అభివృద్ధి పనుల్లో భాగంగా ఖమ్మం–దేవరపల్లి రహదారిలో 119/0 కి.మీ. నుంచి 121/0 కి.మీ. వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను మంత్రి బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ పనులతో పాటు సీసీ డివైడర్లు, సీసీ డ్రైన్ల నిర్మాణం,అదేవిధంగా అశ్వారావుపేట–బూర్గంపాడు రహదారిలో 0/0 కి.మీ. నుంచి 1/5 కి.మీ. వరకు రెండు వరుసల రహదారిని నాలుగు వరుసల రహదారిగా విస్తరించి, పటిష్టపరిచే పనులను ప్రారంభించి, అనంతరం రహదారిపై ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను మంత్రి పరిశీలించారు.
అనంతరం అశ్వారావుపేట మినీ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-20 బాలికల కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారిణులు, మహిళలు బతుకమ్మలతో అశ్వారావుపేట ప్రధాన కూడలి నుంచి క్రీడా ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాగిన ర్యాలీతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. క్రీడా ప్రాంగణానికి చేరుకున్న అనంతరం మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్ కట్ చేసి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారిణులు, మహిళలతో కలిసి బతుకమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, వారితో కలిసి బతుకమ్మ ఆడారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ , దసరా, నవరాత్రులు, బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అశ్వారావుపేట వంటి గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు . ఐదు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మించిన అశ్వారావుపేట మినీ స్టేడియాన్ని భవిష్యత్తులో పట్టణానికి మణిహారంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి బాలికల కబడ్డీ జట్లు ఈ పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. చిన్న మున్సిపాలిటీ అయినప్పటికీ క్రీడాకారిణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి, ఇతర సదుపాయాలు కల్పించిన నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సహకరించిన దాతలను అభినందించారు. వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేసిన అనుభవంతో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్న శాసనసభ్యులు జారే ఆదినారాయణను అభినందించారు.
క్రీడల్లో గెలుపోటములు సహజమని, ప్రతి క్రీడాకారిణి క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొని ప్రతిభను చాటాలని మంత్రి సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారని, వాటిని నెరవేర్చేలా చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం క్రీడారంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు సాధించేలా ప్రభుత్వం క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ, అవసరమైన సదుపాయాలు, ప్రోత్సాహం అందిస్తుందని స్పష్టం చేశారు. రాబోయే ఐదారు సంవత్సరాల్లో అంతర్జాతీయ క్రీడా వేదికలపై తెలంగాణ క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు.
ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డి మాట్లాడుతూ , రాష్ట్రస్థాయి క్రీడా పోటీల నిర్వహణకు ఎంతో ప్రణాళిక, కృషి అవసరమని అన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి …