అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలప స్వాధీనం

10-10-2026 | 11:03pm

సిరికొండ, అక్టోబర్ 10 (విజయక్రాంతి ): నిజామాబాద్ జిల్లా(Nizamabad District), సిరికొండ మండల పరిధిలోని దుప్య తండా గ్రామానికి(Dupya Thanda Village) చెందిన మాలావత్ తిరుపతి నివాసంలో అక్రమంగా టేకు కలప నిల్వ(Teak wood stock) ఉంచినట్లు రాత్రి అటవీ శాఖ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో సమాచారం రావడంతో దాడి చేసి పట్టుకున్నట్లు ఎఫర్వో నర్సింగ్ రావు తెలిపారు.

ఈ సమాచారం మేరకు,  అటవీ శాఖ సిబ్బంది సదరు వ్యక్తి నివాసాన్ని తనిఖీ చేయగా, అక్కడ టేకు కలప నిల్వ ఉంచినట్లు గుర్తించారు. దీంతో అటవీ శాఖ అధికారులు (23) టేకు దుంగలను స్వాధీనం చేసుకొని, తదుపరి చర్యల నిమిత్తం సిరికొండ అటవీ రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు చెప్పారు.ఘటనపై అటవీ శాఖ అధికారులు తదుపరి విచారణ చేస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు