సీఈసీ జ్ఞానేష్ కుమార్ చర్యలు దుర్మార్గం

27-09-2026 | 05:05pm
  1. స్వతంత్ర వ్యవస్థల పరిరక్షణకు ఉద్యమిస్తాం
  2. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

పాల్వంచ , సెప్టెంబర్ 27, (విజయక్రాంతి): కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్(Chief Election Commissioner of India) (సీఈసీ) జ్ఞానేష్ కుమార్(Gyanesh Kumar) రాజ్యాంగ విరుద్ధమైన, ఏకపక్ష పోకడలతో భారత ఎన్నికల వ్యవస్థను(Indian Electoral System) పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా(CPI District Secretary SK Sabir Pasha) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం పాల్వంచ  పార్టీ కార్యాలయం సీఆర్ భవన్‌లో  జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల, పట్టణ కార్యదర్శులు, ప్రజాసంఘాల జిల్లా ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన  పాల్గొని మాట్లాడారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రధాన ఎన్నికల అధికారితో కుమ్మక్కై ప్రజాస్వామ్య వ్యవస్థల స్వయం ప్రతిపత్తిని కాలరాస్తోందని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘంలో తోటి కమిషనర్ల అభ్యంతరాలను సైతం లెక్కచేయకుండా జ్ఞానేష్ కుమార్ ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడటం బహిర్గతమైందని, ఈ ఉదంతం దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు.

పాలకుల అప్రజాస్వామిక, నిరంకుశ పోకడలను ఎండగడుతూ ఎన్నికల వ్యవస్థ, రాజ్యాంగ పరిరక్షణ కోసం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో విస్తృత ప్రజా ఆందోళనలకు పూనుకోనున్నట్లు హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సర్ రెడ్డి పుల్లారెడ్డి, సలిగంటి శ్రీనివాస్, నరాటి ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు మూడ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు