కాలేజీకి వెళ్లి.. కనిపించకుండా పోయింది!
23-09-2026 | 01:15pm
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): కాలేజీ(బ)లో ప్రాక్టికల్స్ ఉన్నాయంటూ కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన కాలేజీ విద్యార్థి(Student)ని అదృశ్యమైన సంఘటన పాల్వంచ మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని లక్ష్మీదేవి పల్లి గ్రామానికి చెందిన చింతల కుమార్ బాబు కుమార్తె చింతల బిందు కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతోంది. ఈనెల 19వ తేదీన కాలేజీకి వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరిన బాలిక మూడు రోజులైనా ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యువతి తల్లిదండ్రులు మణుగూరు మండలం రామానుజవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్ల పై అనుమానం వ్యక్తం చేశారు. తల్లి సుజాత ఫిర్యాదు మేరకు పాల్వంచ గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.